అధికారుల ఆదేశాలకే తూట్లు.. జనరేటర్లతో కోహెన్స్ ఫార్మా కార్యకలాపాలు!
విద్యుత్, మున్సిపల్ నీటి కనెక్షన్లు తొలగించినా ప్రత్యామ్నాయ మార్గాల్లో కంపెనీ నిర్వహణ తక్షణమే కంపెనీని పూర్తిస్థాయిలో మూసివేయాలి.. జిల్లా కలెక్టర్ జోక్యం చేసుకోవాలి: సీపీఐ, సీపీఐ (ఎం.ఎల్) మాస్‌లైన్ డిమాండ్ సూర్యాపేట:- కాలుష్య నియంత్రణ నిబంధనలను ఉల్లంఘించిన కోహెన్స్ ఫార్మా కెమికల్ కంపెనీపై సంబంధిత అధికారులు తక్షణమే కఠిన చర్యలు తీసుకోవాలని సిపిఐ జిల్లా కార్యదర్శి బెజవాడ వెంకటేశ్వర్లు, సిపిఐ(ఎం.ఎల్) మాస్ లైన్ జిల్లా నాయకులు ఎర్ర అఖిల్ కుమార్ లు డిమాండ్ చేశారు. సోమవారం జిల్లా కలెక్టరేట్లో జిల్లా అదనపు కలెక్టర్ బి హరి సింగ్ కి వినతి పత్రం అందజేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ కాలుష్య నియంత్రణ మండలి తనిఖీల్లో అనేక...