వార్డుల అభివృద్ధికి పెద్దపీట.. అర్హులందరికీ ఇందిరమ్మ ఇళ్లు

ముఖ్యమైన పాయింట్స్:సూర్యాపేట అభివృద్ధికి రూ.100 కోట్ల నిధులు తీసుకొస్తాం సూర్యాపేట:- వార్డుల సమగ్ర అభివృద్ధే మున్సిపాలిటీ లక్ష్యమని మున్సిపల్ చైర్మన్ మొరిశెట్టి నివేదిత లక్షాధి, తెలంగాణ పర్యాటక అభివృద్ధి సంస్థ మాజీ చైర్మన్ పటేల్ రమేష్ రెడ్డి అన్నారు. సోమవారం సూర్యాపేట జిల్లా కేంద్రంలోని 17వ వార్డు భగత్‌సింగ్ నగర్‌లో సీసీ రోడ్డు నిర్మాణానికి వారు శంకుస్థాపన చేశారు.ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజా ప్రభుత్వమని, ఇప్పటివరకు సూర్యాపేటలో 1,000 ఇందిరమ్మ ఇళ్లను మంజూరు చేసినట్లు తెలిపారు. అన్ని వార్డుల్లో అర్హులైన ప్రతి ఒక్కరికీ ఇందిరమ్మ ఇళ్లు అందిస్తామని హామీ ఇచ్చారు. సూర్యాపేట నగరం రోజురోజుకూ అభివృద్ధి చెందుతున్న నేపథ్యంలో మరిన్ని మౌలిక...