పెన్షన్ పెంచకుండా వికలాంగులను బైండొవర్ చేయించే హక్కు ముఖ్యమంత్రికి ఎక్కడిది
ఎన్.పి.ఆర్.డి జిల్లా ఉపాధ్యక్షులు వనం ఉపేందర్ రామన్నపేట 9 నవంబర్ 2026 తెలంగాణ వార్త రిపోర్టర్:- వికలాంగుల హక్కుల జాతీయ వేదిక ఎన్.పి.ఆర్.డి యాదాద్రి భువన జిల్లా ప్రధాన కార్యదర్శి వన ఉపేంద్ర మాట్లాడుతూ..రాష్ట్ర ముఖ్యమంత్రి కొడంగల్ పర్యటన సందర్బంగా ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లాలో వికలాంగుల హక్కుల జాతీయ వేదిక నాయకులు, కార్యకర్తలను సోమవారం రోజు ఉదయం నుండే బైండొవర్ చేయడాన్ని ఎన్ పి ఆర్ డిరాష్ట్ర కమిటీ తీవ్రంగా ఖండిస్తుంది.తక్షణమే బైండొవర్ లను ఎత్తివేయాలని డిమాండ్ చేస్తుంది.రాష్ట్ర ముఖ్యమంత్రి కొడంగల్ నియోజకవర్గంలో పర్యటన సందర్బంగా ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లాలో ఉన్న ఎన్ పి ఆర్ డి కార్యకర్తలు, నాయకులకు నోటీసులు ఇచ్చి...