వైభవంగా శ్రీలక్ష్మీ వెంకటేశ్వర స్వామి ప్రభోత్సవం

జోగులాంబ గద్వాల 9 నవంబర్ 2026 తెలంగాణ వార్తా ప్రతినిధి.కేటిదొడ్డి.మండలం వెంకటాపురంలో వెలసిన పాగుంట శ్రీలక్ష్మీ వెంకటేశ్వర స్వామి ప్రభోత్సవ కార్యక్రమాని సోమవారం వైభవంగా నిర్వహించారు. ఉదయం స్వామివారికి అభిషేకాలు, ఆకుపూజ, పుష్పార్చనలు నిర్వహించి స్వామి వారిని పట్టువస్త్రాలు, పూలమాలలతో అలంకరించారు. సాయంత్రం ప్రభను సుందరంగా అలంకరించి ఉత్సవ విగ్రహాలను కొలువుదీర్చి మేళతాళాల మధ్య ఊరేగింపు నిర్వహించారు. ప్రభోత్సవ ఊరేగింపు సందర్భంగా భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొని స్వామివారిని దర్శించుకున్నారు. ఈ సందర్భంగా కేటిదొడ్డి ఎస్ఐ పి.శ్రీనివాసులు ఆధ్వర్యంలో బందోబస్తు నిర్వహించారు.