జగ్గయ్యపేట 10వ వార్డులో ఓట్ల గోల్మాల్పై కోర్టు గర్జన !
చనిపోయినవారి ఓట్లు.. ఆసుపత్రిలో ఉన్నవారి ఓట్లు.. ఇతర రాష్ట్రాల్లో ఉన్నవారి ఓట్లు ! 26 ఆధారాలతో కోర్టును ఆశ్రయించిన అభ్యర్థి.. ఎన్నికల అధికారుల పనితీరుపై తీవ్ర ప్రశ్నలు ! జగ్గయ్యపేట:- జగ్గయ్యపేట మున్సిపాలిటీ 10వ వార్డు ఎన్నికల వివాదం రోజురోజుకూ ముదురుతోంది. తనకు జరిగిన అన్యాయంపై 26 ఆధారాలతో అభ్యర్థి ఈరోజు జగ్గయ్యపేట కోర్టును ఆశ్రయించి ఫిర్యాదు సమర్పించడం సంచలనంగా మారింది. చనిపోయిన వ్యక్తుల పేర్లపై ఓట్లు.. ఇతర రాష్ట్రాల్లో ఉద్యోగాలు చేస్తున్న వారి పేర్లపై ఓట్లు.. ఆసుపత్రుల్లో చికిత్స పొందుతున్న వారి పేర్లపై ఓట్లు.. ఇతర రాష్ట్రాల్లో ఉన్న లారీ డ్రైవర్లు జగ్గయ్యపేటకు రాకుండానే వారి పేర్లపై ఓట్లు ! ఇన్ని ఆరోపణలు బయటకు...