ఘనంగా సిఎం రేవంత్ రెడ్డి జన్మదిన వేడుకలు
సూర్యాపేట:- తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి ఎనుముల రేవంత్ రెడ్డి జన్మదినం సందర్భంగా సూర్యాపేట మార్కెట్ కమిటీ చైర్మన్ కొప్పుల వేణారెడ్డి ఆదేశాల మేరకు సూర్యాపేట పట్టణంలోని విద్యా నగర్ లోని వారి కార్యాలయంలో కౌన్సిలర్ ఎల్గూరి ఇందిరా వీరయ్య గౌడ్ ఆధ్వర్యంలో సీఎం రేవంత్ రెడ్డి జన్మదిన వేడుకల్ని ఘనంగా నిర్వహించారు... ఈ సందర్భంగా పెద్ద సంఖ్యలో కాంగ్రెస్ పార్టీ నాయకులు పాల్గొని కేక్ కట్ చేసి శుభాకాంక్షలు తెలియజేశారు. టపాసులు కాల్చి సంబరాలు జరుపుకున్నారు. ఈసందర్భంగా నాయకులు మాట్లాడుతూ గత మూడు సంవత్సరాల ప్రజాపాలనలో రేవంత్ రెడ్డి నాయకత్వంలో కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజలకు అనేక సంక్షేమ పథకాలు అమలు చేస్తుందని అన్నారు. 200 యూనిట్ల...