టీచర్ కు సొంత నిధులతో జీతం అందజేసిన గ్రామ సర్పంచ్

తిరుమలగిరి 08 నవంబర్ 2026 తెలంగాణ వార్త రిపోర్టర్ తిరుమలగిరి మండలం జలాల్ పురం గ్రామంలో ప్రాథమిక పాఠశాలలో విద్యార్థులకు అధ్యాపకులు తక్కువగా ఉండటం వలన విద్యార్థులకు మంచి విద్య బోధనను అందించాలని ఉద్దేశంతో టీచర్(వాలెంటర్) గా కొమ్ము. వనితను నియమించడం జరిగింది గ్రామ సర్పంచ్ బెట్టం గణేశ్వరి రాజు తమ సొంత నిధులతో రెండు నెలల జీతం 12వేల రూపాయలను అందజేయటం జరిగింది. అనంతరం సర్పంచ్ గణేశ్వరి కి శాలువాతో సన్మానించిన పాఠశాల యాజమాన్యం ఈ సందర్భంగా ఉపసర్పంచ్ కొమ్ము. సోమయ్య మమత టీచర్ అజయ్ మరియు వేముల.శ్రీనివాస్(దాసు).కొమ్ము.సుధాకర్.అంకటి. యాకన్న.అంగన్వాడీ టీచర్స్ కొమ్ము. శాంత, రుద్రంగి. రేణుక పాల్గొన్నారు.