మా ఇందిరమ్మ ఇంట్లో దీపావళి” సంబరాల్లో పాల్గొన్న జిల్లా కలెక్టర్ అంకిత్
శ్రీనగర్ కాలనీలో ఇందిరమ్మ ఇళ్ల లబ్ధిదారులతో కలిసి దీపాలు వెలిగించి, టపాసులు కాల్చిన కలెక్టర్ రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన “మా ఇందిరమ్మ ఇంట్లో దీపావళి” సంబరాల కార్యక్రమంలో భాగంగా జిల్లా కలెక్టర్ అంకిత్ శనివారం లక్ష్మీదేవిపల్లి మండలం శ్రీనగర్ కాలనీలో పర్యటించి ఇందిరమ్మ ఇళ్ల లబ్ధిదారులైన వసంత, ఉపేంద్ర, లీలావతి ఇళ్లలో నిర్వహించిన దీపావళి సంబరాల్లో పాల్గొన్నారు. ఈ సందర్భంగా కలెక్టర్ లబ్ధిదారుల కుటుంబ సభ్యులతో ఆప్యాయంగా ముచ్చటించారు. అనంతరం వారితో కలిసి దీపాలు వెలిగించి, టపాసులు కాల్చి దీపావళి సంబరాల్లో ఉత్సాహంగా పాల్గొన్నారు. లబ్ధిదారులతో కలిసి పండుగ ఆనందాన్ని పంచుకుంటూ వారి సంతోషంలో భాగస్వాములయ్యారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ ఇందిరమ్మ ఇళ్ల...