ఎస్ఐఆర్ ప్రక్రియ జాబితాలో పేరు లేని అర్హులకు మరో అవకాశం
అర్హులైన వారు ఎన్యుమరేషన్ ఫారాలు సమర్పించి తుది జాబితాలో తమ పేర్లు చేర్చుకోవచ్చు జిల్లా అదనపు కలెక్టర్ మధు మోహన్ జోగులాంబ గద్వాల7 నవంబర్ 2026 తెలంగాణ వార్త ప్రతినిధి. గద్వాల. ఎస్ఐఆర్–2026లో ముసాయిదా ఓటర్ల జాబితాలో పేరు లేని అర్హులకు నవంబర్ 21లోగా ఫారాలు సమర్పించి పేరు నమోదు చేసుకునేందుకు భారత ఎన్నికల సంఘం మరో అవకాశం కల్పించినట్లు జిల్లా అదనపు కలెక్టర్ మధు మోహన్ శనివారం ఒక ప్రకటనలో తెలిపారు. భారత ఎన్నికల సంఘం జారీ చేసిన తాజా మార్గదర్శకాల మేరకు గద్వాల,అలంపూర్ నియోజకవర్గాల పరిధిలోని అర్హులైన ఓటర్లు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని సూచించారు.ఈ మేరకు సంబంధిత పోలింగ్ కేంద్రాలు, గ్రామ...