ముందుగా తెలంగాణ రాష్ట్ర ముఖ్య మంత్రి రేవంత్ రెడ్డి గారికి జన్మదిన శుభాకాంక్షలు తెలిపిన

అలంపూర్ నియోజకవర్గ బిసి సీనియర్ నాయకులు వడ్డేపల్లి శ్రీనివాసులు గారు.. 20 ఏళ్ల రాజకీయ అనుబంధం… మరచిపోలేని ఆత్మీయ స్నేహం.. రాజకీయ ప్రస్థానంలో జడ్పీటీసీగా ఉన్న రోజుల నుంచి మీతో ఏర్పడిన పరిచయం నేటికీ ఎంతో ఆత్మీయంగా కొనసాగడం నాకు ఎంతో సంతోషాన్ని, గర్వాన్ని కలిగిస్తోంది. ఒక సాధారణ ప్రజాప్రతినిధిగా ప్రారంభమైన మీ రాజకీయ ప్రయాణం… ఎన్నో ఒడిదుడుకులను ఎదుర్కొని, ప్రజల ఆదరాభిమానాలతో అంచెలంచెలుగా ఎదుగుతూ నేడు తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి స్థాయికి చేరుకోవడం మీ పట్టుదలకు, రాజకీయ పోరాట పటిమకు నిదర్శనం. రాజకీయాల్లో పదవులు వస్తుంటాయి… పోతుంటాయి. అధికారం మారుతుంటుంది… కానీ మనుషుల మధ్య ఉన్న నిజమైన స్నేహం, నమ్మకం, అనుబంధం ఎప్పటికీ మారకూడదు....