రైతుల కష్టాన్ని దోచుకుంటున్న మిల్లర్ల సిండికేట్‌పై చర్యలు తీసుకోవాలి
వరి ధాన్యానికి కనీస మద్దతు ధర కల్పించాలి: తెలంగాణ రైతు సంఘం జిల్లా అధ్యక్షులు మల్లు నాగార్జున రెడ్డి సూర్యాపేట కలెక్టరేట్: జిల్లాలో రైస్ మిల్లర్లు సిండికేట్‌గా ఏర్పడి రైతుల వద్ద నుంచి వరి ధాన్యాన్ని ప్రభుత్వం ప్రకటించిన కనీస మద్దతు ధర (ఎంఎస్‌పీ) కంటే తక్కువ ధరకు కొనుగోలు చేస్తూ రైతులను తీవ్రంగా నష్టపరుస్తున్నారని తెలంగాణ రైతు సంఘం జిల్లా అధ్యక్షులు మల్లు నాగార్జున రెడ్డి ఆరోపించారు. మిల్లర్ల అక్రమ కొనుగోళ్లపై సమగ్ర విచారణ జరిపి రైతులకు గిట్టుబాటు ధర కల్పించాలని డిమాండ్ చేశారు. శనివారంతెలంగాణ రైతు సంఘం సూర్యాపేట జిల్లా కమిటీ ఆధ్వర్యంలో జిల్లా జాయింట్ కలెక్టర్ హరి సింగ్‌కు కలెక్టరేట్‌లో వినతిపత్రం...