ఈ నెల 15న న్యూఢిల్లీలో అవార్డు ప్రధానం - వైద్యంతో పాటు సేవా రంగంలో 10 ఏళ్లుగా విశేష కృషికి గుర్తింపు
వైద్యం కేవలం వృత్తి మాత్రమే కాదు, సేవా భావంతో చేస్తేనే సమాజానికి నిజమైన సేవ చేసినట్లు అవుతుందని నిరూపించారు ప్రముఖ ఈ ఎన్ టి వైద్యులు డాక్టర్ ఆనందరావు. సాధారణ డాక్టర్ జీవితానికి అతీతంగా, ఒక విద్యావంతుడిగా సమాజం పట్ల బాధ్యతగా, సామాజిక చైతన్యంతో, సమాజ సేవ చేయడం చాలా ముఖ్యమని ఆయన నమ్ముతారు. ఆ నమ్మకాన్ని గత 10 ఏళ్లుగా తన సేవల ద్వారా నిరూపిస్తున్నారు. డాక్టర్ ఆనందరావు గత పది సంవత్సరాలుగా సమాజానికి చేస్తున్న నిరంతర సేవలను గుర్తించి, కేంద్ర ప్రభుత్వం/ జాతీయ సంస్థ ఆయనను "బెస్ట్ సర్వీస్ సొసైటీ నేషనల్ అవార్డు" కు ఎంపిక చేసింది. ఇది సూర్యాపేట జిల్లాకే గర్వకారణం....