ఖమ్మంలో ఘనంగా జిల్లా స్థాయి గో విజ్ఞాన్ పరీక్ష

210 మంది విద్యార్థుల ఉత్సాహభరితంగా పాల్గొన్నారు. ఖమ్మం : గోసేవ తెలంగాణ ఆధ్వర్యంలో ఖమ్మం జిల్లా స్థాయి గో విజ్ఞాన్ పరీక్ష–2026 గుట్టల బజార్‌లోని శ్రీ రామకృష్ణ విద్యాలయంలో ఘనంగా నిర్వహించారు . ఉదయం 10 గంటలకు ప్రారంభమైన ఈ పరీక్షకు జిల్లాలోని వివిధ పాఠశాలల నుంచి సుమారు 210 మంది విద్యార్థులు ఉత్సాహంగా హాజరయ్యారు . విద్యార్థుల్లో గోవుల పట్ల జ్ఞానం , అవగాహన , సేవాభావాన్ని పెంపొందించడంతో పాటు భారతీయ సంస్కృతి , సంప్రదాయాలను భావితరాలకు అందించడమే పరీక్ష ప్రధాన ఉద్దేశమని నిర్వాహకులు తెలిపారు . 'నాలెడ్జ్ , కల్చర్ , బెటర్ టుమారో' నినాదంతో ఈ పరీక్షను నిర్వహించినట్లు పేర్కొన్నారు ....