నేలరాలిన ఎర్రమందారం .....తీవ్ర దిగ్భ్రాంతి తొ పార్టీ శ్రేణులు

తిరుమలగిరి 07 నవంబర్ 2026 తెలంగాణ వార్త రిపోర్టర్ "కమ్యూనిస్టు ఉద్యమ చరిత్రపై తనదైన ముద్ర వేసిన రాజకీయ దిగ్గజం, ఉమ్మడి నల్లగొండ జిల్లా కమ్యూనిస్టు పార్టీ నిర్మాణంలో క్రియాశీలక పాత్ర పోషించి.. సుదీర్ఘకాలం పాటు ప్రజా ఉద్యమాలకు సారథ్యం వహించిన కమ్యూనిస్టు యోధుడు... పోతరాజు వెంకటయ్య తుదిశ్వాస విడిచారు. తిరుమలగిరి మండలం తొండ గ్రామానికి చెందిన పోతరాజు వెంకటయ్య (70) అనేక ప్రజా ఉద్యమాల్లో సిపిఎం పార్టీలో క్రియాశీలకంగా వ్యవహరించారు. జిల్లా చరిత్రలోనే సుదీర్ఘకాలంగా 30 ఏళ్లు పార్టీ కోసం పనిచేశారు. ఓ వైపు పార్టీ బలోపేతం కోసం నిరంతరం కృషి సాగిస్తూనే అనేక ప్రజా ఉద్యమాలకు సారథ్యం వహించారు. కొంతకాలంగా షుగర్ సంబంధిత...