గంజాయి నిందితుల అరెస్ట్.. రిమాండ్ కు తరలింపు.

ఒడిశా సరిహద్దు నుంచి గంజాయి తీసుకొచ్చి విక్రయించేందుకు యత్నం.. గంజాయి రవాణా, విక్రయం, వినియోగంపై కఠిన చర్యలు: పట్టణ ఇన్‌స్పెక్టర్ వెంకటయ్య సూర్యాపేట, నవంబర్ 7:- గంజాయి అక్రమ రవాణా, విక్రయాలపై ప్రత్యేక నిఘా ఏర్పాటు చేసి కఠిన చర్యలు తీసుకుంటున్నట్లు సూర్యాపేట పట్టణ ఇన్‌స్పెక్టర్ వెంకటయ్య తెలిపారు. ఇందులో భాగంగా సూర్యాపేట రెండవ పట్టణ పోలీసులు 1,500 గ్రాముల గంజాయిని స్వాధీనం చేసుకుని, నలుగురు నిందితులను అరెస్ట్ చేసి రిమాండ్‌కు తరలించారు. మరో ఇద్దరు ప్రధాన నిందితులు పరారీలో ఉన్నారు. నమ్మదగిన సమాచారం మేరకు ఎస్సై రామచంద్ర గౌడ్ తన సిబ్బందితో కలిసి శుక్రవారం రోజున సాయంత్రం పట్టణంలోని చివ్వెంల రహదారిపై అమ్మ గార్డెన్...