29 మంది లబ్ధిదారులకు ఇందిరమ్మ ఇళ్ల పట్టాలు పంపిణీ చేసిన సర్వోత్తమ్ రెడ్డి

సూర్యాపేట మండలంలోని పిన్నాయిపాలెం గ్రామానికి చెందిన 29 మంది లబ్ధిదారులకు ఇందిరమ్మ ఇళ్ల పట్టాలను నల్లగొండ–ఖమ్మం–వరంగల్ పట్టభద్రుల శాసనమండలి కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి రాంరెడ్డి సర్వోత్తమ్ రెడ్డి గారు, డీసీసీ అధ్యక్షుడు గుడిపాటి నర్సయ్య గారు పంపిణీ చేశారు. సూర్యాపేట పట్టణంలోని వైట్ హౌస్‌లో, మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు కోతి గోపాల్ రెడ్డి గారి ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో సర్వోత్తమ్ రెడ్డి గారు మాట్లాడుతూ, సూర్యాపేట నియోజకవర్గంలో 3,500 ఇళ్లను మంజూరు చేసిన ఘనత కాంగ్రెస్ ప్రభుత్వానిదేనని పేర్కొన్నారు. రాజకీయాలకు అతీతంగా ప్రతి అర్హుడికి ఇందిరమ్మ ఇల్లు అందించడమే ప్రభుత్వ లక్ష్యమని తెలిపారు. ఇంటి నిర్మాణం వేగంగా పూర్తి చేసుకునేందుకు ప్రతి వారం...