సూర్యాపేట జిల్లా ప్రజలకు దీపావళి శుభాకాంక్షలు..

కుటుంబ సభ్యులతో కలిసి ప్రశాంత వాతావరణంలో పండుగ జరుపుకోవాలి బాణాసంచాతో ప్రమాదం.. ద్వీపాల వెలుగులో పండుగ జరుపుకోవాలి – జిల్లా ఎస్పీ నరసింహ ఐపీఎస్ సూర్యాపేట, 7 నవంబర్ 2026 తెలంగాణ వార్త రిపోర్టర్:- దీపావళి పండుగ సందర్భంగా సూర్యాపేట జిల్లా ప్రజలందరికీ జిల్లా పోలీస్ శాఖ తరఫున జిల్లా ఎస్పీ నరసింహ ఐపీఎస్ హృదయపూర్వక శుభాకాంక్షలు తెలిపారు. దీపావళి పర్వదినం ప్రతి ఒక్కరి జీవితాల్లో వెలుగులు నింపాలని, ప్రజలందరూ సుఖసంతోషాలతో, ఆయురారోగ్యాలతో, సిరిసంపదలతో వర్ధిల్లాలని ఆకాంక్షించారు. దీపావళి పండుగను ప్రజలందరూ కుటుంబ సభ్యులతో కలిసి ఆనందోత్సాహాలతో, ప్రశాంత వాతావరణంలో జరుపుకోవాలని ఎస్పీ కోరారు. పండుగ వేళ ఇతరులకు ఇబ్బంది కలగకుండా, శాంతిభద్రతలకు విఘాతం కలగకుండా...