తెలంగాణలో నీళ్లు కరువు

- నీళ్లు లేవు.. నిబంధనలు మాత్రం బోలెడు - హైదరాబాద్‌ను ఇబ్బందుల్లోకి నెట్టిన కాంగ్రెస్ ప్రభుత్వం అంటూ విమర్శలు - ఐటీ ఉద్యోగులకు వర్క్ ఫ్రమ్ హోమ్.. - విద్యాసంస్థలకు ఒంటిపూట బడులు.. హాస్టళ్లకు నీళ్ల సెలవులు అంటూ ప్రచారం తెలంగాణ రాజధాని హైదరాబాద్‌లో నీటి కొరత తీవ్రతరం అవుతున్న నేపథ్యంలో రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యామ్నాయ చర్యలపై దృష్టి సారించినట్లు వార్తలు వెలువడుతున్నాయి. విద్యాసంస్థలకు ఒంటిపూట తరగతులు నిర్వహించడం, ఐటీ ఉద్యోగులకు వర్క్ ఫ్రమ్ హోమ్ విధానాన్ని అమలు చేసేలా సంస్థలకు సూచించడం వంటి ప్రతిపాదనలను ప్రభుత్వం పరిశీలిస్తున్నట్లు సమాచారం. మరోవైపు నగరంలోని పలు కార్పొరేట్ రెసిడెన్షియల్ విద్యాసంస్థలు నీటి కొరత కారణంగా హాస్టళ్లకు తాత్కాలిక...