పుటాన్ దొడ్డి పీఏసీఎస్ నూతన చైర్మన్ బోయ మధు నాయుడుకు సంధ్య బాబు ఘన సన్మానం
జోగులాంబ గద్వాల 6 నవంబర్ 2026 తెలంగాణ వార్త ప్రతినిధి. ఎర్రవల్లి. మండల కేంద్రంలోని పుటాన్ దొడ్డి ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘం పీ.ఏ.సీ.ఎస్. నూతన చైర్మన్గా నియమితులైన బోయ మధు నాయుడును ఈరోజు ఎర్రవల్లి మండల పరిధిలో ఘనంగా సత్కరించారు. ఈ సందర్భంగా జోగులాంబ గద్వాల జిల్లా కాంగ్రెస్ పార్టీ సోషల్ మీడియా జిల్లా కోఆర్డినేటర్ సంధ్య బాబు నూతన చైర్మన్ బోయ మధు నాయుడును పూలమాల శాలువా పుష్పగుచ్ఛంతో ఘనంగా సన్మానించి శుభాకాంక్షలు తెలిపారు. అనంతరం సంధ్య బాబు మాట్లాడుతూ నూతనంగా చైర్మన్ బాధ్యతలు చేపట్టిన బోయ మధు నాయుడు కి హృదయపూర్వక అభినందనలు తెలిపారు. మన ప్రియతమ నాయకులు అలంపూర్ మాజీ...