కోహెన్స్ ఫార్మా మూసివేత దిశగా సీపీఐ పోరాటం ఘన విజయం
సీపీఐ పోరాట ఫలితంగా విద్యుత్ సరఫరా నిలిపివేత – జిల్లా కార్యదర్శి బెజవాడ వెంకటేశ్వర్లు సూర్యాపేట: కోహెన్స్ ఫార్మా (సువెన్ కంపెనీ) మూసివేతకు సంబంధించి వచ్చిన అధికారిక ఆదేశాల మేరకు ఈరోజు సాయంత్రం 5:30 గంటలకు కంపెనీకి విద్యుత్ సరఫరాను నిలిపివేశారు. గత మూడు రోజులుగా భారత కమ్యూనిస్టు పార్టీ (సీపీఐ) ఆధ్వర్యంలో నిర్వహించిన ఆందోళనలు, నిరసనలు ఫలితంగా ఈ పరిణామం చోటుచేసుకుంది. కంపెనీ సమస్యపై సీపీఐ నాయకులు నిరంతరం పోరాటం నిర్వహిస్తూ విద్యుత్ శాఖ అధికారులు ఎ స్సీ , ఏ ఈ ఈరోజు కలిసి సంబంధిత అధికారులపై ఒత్తిడి తీసుకువచ్చారు. ప్రజల పక్షాన, బాధితుల న్యాయమైన డిమాండ్ల సాధన కోసం సాగించిన పోరాటంలో...