అయ్యప్ప సొసైటీలో అక్రమ నిర్మాణాలపై కవిత ఫైర్.. రేవంత్ సర్కారుకు నెల రోజుల డెడ్‌లైన్!
హైదరాబాద్:- నగరంలోని ఖానామెట్ పరిధిలో ఉన్న అయ్యప్ప సొసైటీలో జరుగుతున్నాయని ఆరోపిస్తున్న అక్రమ నిర్మాణాలపై తెలంగాణ రక్షణ సేన అధినేత్రి కల్వకుంట్ల కవిత తీవ్రస్థాయిలో స్పందించారు. ఈ వ్యవహారంపై సమగ్ర సర్వే నిర్వహించి, అక్రమ నిర్మాణాలపై తక్షణమే చర్యలు తీసుకోవాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ఈ మేరకు ప్రభుత్వానికి నెల రోజుల గడువు ఇస్తున్నట్లు ప్రకటించారు. ఈలోగా చర్యలు తీసుకోకపోతే తామే క్షేత్రస్థాయిలోకి వెళ్లి అక్రమ నిర్మాణాలకు రెడ్ మార్క్ వేస్తామని హెచ్చరించారు. గురువారం బంజారాహిల్స్‌లోని పార్టీ కార్యాలయంలో నిర్వహించిన మీడియా సమావేశంలో కవిత మాట్లాడుతూ.. అయ్యప్ప సొసైటీలో గురుకుల ట్రస్ట్‌కు సంబంధించిన భూముల్లో కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత సుమారు 500...