నవంబర్ 29లోగా అర్హులందరికీ ఇళ్లు మంజూరు చేయాలి

ఖమ్మం , నవంబర్ 5:- వెలుగుమట్ల భూదాన భూమి బాధితులైన అర్హులందరికీ ప్రభుత్వం ఇళ్లు నిర్మించి ఇవ్వాలని డిమాండ్ చేస్తూ కేతవరపు కృష్ణారావు అధ్యక్షతన టిటిడిసిలో గురువారం విలేకరుల సమావేశం నిర్వహించారు. ఈ సమావేశానికి ముఖ్య అతిథిగా హాజరైన జస్టిస్ చంద్రకుమార్ మాట్లాడుతూ.. భూదాన భూమిలో 15 ఏళ్లుగా నివాసం ఉంటున్న పేదల ఇళ్లను ప్రభుత్వం కూల్చివేసిందని పేర్కొన్నారు. బాధితుల పోరాట ఫలితంగా 311 మందికి అదే ప్రాంతంలో ఇందిరమ్మ ఇళ్లను నిర్మించేందుకు ప్రభుత్వం అంగీకరించిందని తెలిపారు. అయితే మిగిలిన బాధితుల్లో అర్హులైన వారికి కూడా ఇళ్లు మంజూరు చేయాలని కోరుతూ గత కలెక్టర్ , రెవెన్యూ మంత్రిని కలిసి వినతిపత్రం అందజేశామని చెప్పారు. అర్హుల...