పేద విద్యార్థులకు ఉచితంగా ఆల్ ఇన్ వన్ పుస్తకాల పంపిణీ

పేద విద్యార్థుల విద్యాభివృద్ధికి మజ్లిస్ పార్టీ ఎల్లప్పుడూ అండగా ఉంటుంది నాంపల్లి ఎమ్మెల్యే మాజిద్ హుస్సేన్ కోరుట్ల, నవంబర్,05:- పేద విద్యార్థుల విద్యాభివృద్ధికి మజ్లిస్ పార్టీ ఎల్లప్పుడూ అండగా ఉంటుందని నాంపల్లి ఎమ్మెల్యే మాజిద్ హుస్సేన్ అన్నారు. ఆల్ ఇండియా మజ్లిస్-ఎ-ఇత్తెహాదుల్ ముస్లిమీన్ (ఎంఐఎం) పార్టీ అధ్యక్షులు, హైదరాబాద్ ఎంపీ అసదుద్దీన్ ఓవైసీ ఆదేశాల మేరకు గురువారం కోరుట్ల పట్టణంలోని గడిగుడ్జు ఏ జె ఎం ఫంక్షన్ హాల్‌లో సాలారే మిల్లత్, మాజీ ఎంపీ దివంగత సుల్తాన్ సలావుద్దీన్ ఓవైసీ పేరుతో రూపొందించిన ఆల్ ఇన్ వన్ 2026 గైడ్లను పదవ తరగతి విద్యార్థులకు ఉచితంగా పంపిణీ చేశారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన...