యువతలో ఎన్నికలలో ఓటు హక్కు ప్రాముఖ్యత పై అవగాహన పెంపొందించాలి

ముఖ్యమైన పాయింట్స్:తెలంగాణ రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి సి. సుదర్శన్ రెడ్డి ఎలక్టోరల్ లిటరసీ క్లబ్‌ల ద్వారా వ్యాసరచన, క్విజ్ పోటీలు నిర్వహించాలి నవంబర్ 2 నుంచి 18 వరకు మూడు స్థాయిల్లో పోటీల నిర్వహణ – భారత ఎన్నికల సంఘం భారత ఎన్నికల సంఘం యువతలో ఎన్నికల అవగాహనను పెంపొందించేందుకు చేపట్టిన కొత్త కార్యక్రమాల్లో భాగంగా, తెలంగాణ రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి (CEO) సి. సుదర్శన్ రెడ్డి గురువారం అన్ని జిల్లా ఎన్నికల అధికారులు, జిల్లా కలెక్టర్ లతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. ఈ వీడియో కాన్ఫరెన్స్ కు సూర్యాపేట జిల్లా కలెక్టరేట్ నుండి కలెక్టర్ తేజస్ నంద్ లాల్ పవార్ పాల్గొన్నారు....