భార్యాభర్తల మధ్య కలహాలు – బలవుతున్న బాల్యం
పిల్లల విద్య, భవిష్యత్తు, వ్యక్తిత్వం, నైతిక విలువల పరిరక్షణలో తల్లిదండ్రులు, ప్రభుత్వం, న్యాయవ్యవస్థ బాధ్యత ఉపోద్ఘాతం N.GOPAL,Advocate, High Court ,Telangana. కుటుంబం అనేది సమాజానికి పునాది. తల్లిదండ్రులు పిల్లలకు జన్మనివ్వడమే కాకుండా, వారికి ప్రేమను, భద్రతను, విద్యను, క్రమశిక్షణను, నైతిక విలువలను అందించి, సమాజంలో గౌరవప్రదమైన వ్యక్తులుగా ఎదిగేలా చేయాలి. పిల్లలకు తల్లిదండ్రులే తొలి గురువులు, తొలి మార్గదర్శకులు, తొలి ఆదర్శాలు. కుటుంబంలో వారు చూసే ప్రవర్తన, వినే మాటలు, అనుభవించే భావోద్వేగాలు వారి జీవితంపై చెరగని ముద్ర వేస్తాయి. అయితే నేటి సమాజంలో అనేక కుటుంబాలు భార్యాభర్తల మధ్య నిరంతర కలహాలు, అపార్థాలు, అనుమానాలు, ఆర్థిక సమస్యలు, అహంకారాలు, పరస్పర నిందారోపణలు, కుటుంబ...