హెచ్‌ఐవీ వైరస్‌కి రక్షణ కవచమే లేకుండా చేసే సరికొత్త అస్త్రం, ఏడాదికి రెండు డోసులు చాలు

ప్రపంచానికి అవసరమైన అత్యవసర మందులను చౌకగా అందించడంలో భారత ఔషధ రంగాన్ని "ఫార్మసీ ఆఫ్ ది వరల్డ్" అని ఎందుకు అంటారో మరోసారి రుజువు అయింది. క్లినికల్ ట్రయల్స్ (PURPOSE-1 స్టడీ) ప్రకారం, ముఖ్యంగా యువతుల్లో ఈ ఇంజెక్షన్ హెచ్‌ఐవీ సంక్రమణను 100% సమర్థవంతంగా నిరోధించినట్లు గతంలో రుజువైంది. ఆఫ్రికా లాంటి దేశాల్లో రోజువారీ మాత్రలు వేసుకునే స్వేచ్ఛ లేని మహిళలకు ఇది జీవరక్షక ఔషధంగా నిలుస్తుంది. భారతీయ ప్రముఖ ఫార్మా దిగ్గజం డాక్టర్ రెడ్డీస్ లేబొరేటరిస్ తయారు చేసిన 'లెనాకాపావిర్ (Lenacapavir)' జెనరిక్ ఇంజెక్షన్‌కు అమెరికా ఫుడ్ అండ్ డ్రగ్ అడ్మినిస్ట్రేషన్ (US FDA) తాత్కాలిక అనుమతి ఇచ్చింది. హెచ్‌ఐవీ నివారణ రంగంలో ఇది...