జెడ్పీహెచ్ఎస్ ఆకుపాములలో జిల్లా కలెక్టర్ ఆకస్మిక తనిఖీ
ఇంకుడు గుంతలు, టాయిలెట్లు, కిచెన్ పరిశీలన 7వ తరగతి విద్యార్థులతో మాట్లాడి చదువుపై ఆరా ప్రభుత్వ పాఠశాలల్లో మౌలిక సదుపాయాలు, పారిశుద్ధ్యం, విద్యాబోధన ప్రమాణాలు మెరుగుపరచాలని జిల్లా కలెక్టర్ తేజస్ నంద్ లాల్ పవార్ సూచించారు. శనివారం ఆకుపాముల జెడ్పీహెచ్ఎస్ పాఠశాలను సందర్శించిన ఆయన ఇంకుడు గుంతలు, టాయిలెట్లు, వంటగదిని పరిశీలించారు. అనంతరం పదో తరగతి విద్యార్థులతో కలెక్టర్ మాట్లాడారు. వారి చదువు, విద్యా ప్రమాణాలు, పరీక్షల సన్నద్ధత గురించి వివరాలు అడిగి తెలుసుకున్నారు. విద్యార్థుల చదువు తీరుపై సంతృప్తి వ్యక్తం చేశారు. వంటగదిని కూడా సందర్శించి మధ్యాహ్న భోజనం తయారీ, నిర్వహణను పరిశీలించారు. పాఠశాలలోని సమస్యలు, అవసరమైన సదుపాయాల గురించి ఉపాధ్యాయులను అడిగి తెలుసుకున్నారు....