ఎస్‌డబ్ల్యూసీ గోదాంలో కలెక్టర్, ఎస్పీ తనిఖీలు

బియ్యం నాణ్యతలో రాజీ పడొద్దు.. అధికారులకు కలెక్టర్ ఆదేశం ఆరు బఫర్ గోదాంల హమాలీలకు లేబర్ కార్డులు ఇప్పిస్తాం Suryapet:- గోదాంలలో బియ్యం నిల్వ, నాణ్యత విషయంలో ఎలాంటి నిర్లక్ష్యం చేయొద్దని జిల్లా కలెక్టర్ తేజస్ నంద్ లాల్ పవార్ అధికారులను ఆదేశించారు. బుధవారం కోదాడ సమీపంలోని బాలాజీనగర్ ఎస్‌డబ్ల్యూసీ గోదాంను జిల్లా కలెక్టర్, ఎస్పీ కె. నరసింహ సందర్శించి తనిఖీలు నిర్వహించారు. గోదాంలోని బియ్యం నిల్వలను, నిర్వహణ తీరును పరిశీలించారు. స్టాక్ రికార్డులను తనిఖీ చేయడంతో పాటు బియ్యం శాంపిల్స్ సేకరించి నాణ్యత పరీక్షలు చేయించారు. పరీక్ష ఫలితాలు సంతృప్తికరంగా ఉన్నాయని అధికారులు తెలిపారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ పేదలకు పంపిణీ చేసే...