ఆర్టీసీ కార్మికులపై ప్రయాణికుల దాడులను అరికట్టాలి
మహిళా ఉద్యోగులకు రక్షణ కల్పించాలి – సమస్యల వలయంలో ఆర్టీసీ కార్మికులు కండక్టర్ ప్రవళిక కుటుంబాన్ని ప్రభుత్వం ఆదుకోవాలి నల్ల బ్యాడ్జీలతో సూర్యాపేట డిపో ఎదుట కార్మికుల నిరసన సూర్యాపేట: ఆర్టీసీ కార్మికులపై ప్రయాణికుల దాడులను అరికట్టేందుకు ప్రభుత్వం ప్రత్యేక రక్షణ చట్టాన్ని తీసుకురావాలని, విధి నిర్వహణలో మహిళా ఉద్యోగులకు పూర్తి భద్రత కల్పించాలని స్టాఫ్ అండ్ వర్కర్స్ ఫెడరేషన్, తెలంగాణ ఆర్టీసీ వర్కర్స్ యూనియన్ రాష్ట్ర కార్యదర్శులు బత్తుల సుధాకర్, సుంకరి శ్రీనివాస్ డిమాండ్ చేశారు. మణుగూరు డిపోలో కండక్టర్గా విధులు నిర్వహిస్తున్న ప్రవళిక పది రోజుల క్రితం ప్రయాణికుల దాడిలో తీవ్రంగా గాయపడి సాయి సంజీవని ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మృతి చెందడం...