అనుమతులు లేకుండా లక్కీ డ్రాలు, అదృష్ట పథకాల నిర్వహణ చట్టవిరుద్ధం.

ప్రజల ఆర్థిక భద్రతకు భంగం కలిగిస్తే కఠిన చర్యలు. అక్రమ లక్కీ డ్రాల నిర్వాహకులపై చట్టప్రకారం కేసులు నమోదు చేస్తాం. ఇది సామాజిక, ఆర్థిక నేరం – జిల్లా ఎస్పీ కె. నరసింహా, ఐపీఎస్. సూర్యాపేట జిల్లాలో ఎలాంటి ప్రభుత్వ అనుమతులు లేకుండా లక్కీ డ్రాలు, అదృష్ట పథకాలు, బహుమతుల పేరుతో డబ్బులు వసూలు చేసే కార్యక్రమాలను నిర్వహించడం చట్టవిరుద్ధమని జిల్లా ఎస్పీ కె. నరసింహా, ఐపీఎస్ ఒక ప్రకటనలో హెచ్చరించారు. కొంతమంది వ్యక్తులు తక్కువ మొత్తంలో డబ్బులు చెల్లిస్తే విలువైన బహుమతులు, ద్విచక్ర వాహనాలు, కార్లు, బంగారు ఆభరణాలు, ఇతర వస్తువులు గెలుచుకోవచ్చంటూ ప్రజలను ఆకర్షిస్తూ లక్కీ డ్రాల పేరుతో డబ్బులు వసూలు చేస్తున్నట్లు...