కోటమర్తి గ్రామంలో మహిళా సంఘం భవనంకు శంకుస్థాపన చేసిన ఎమ్మెల్యే
అడ్డగూడూరు 4 నవంబర్ 2026 తెలంగాణ వార్త రిపోర్టర్:-యాదాద్రి భువనగిరి జిల్లా అడ్డగూడూరు మండల పరిధిలోని కోటమర్తి గ్రామంలో మహిళా సంఘం భవనం శంకుస్థాపన చేశారు. అనంతరం ఆయన మాట్లాడుతూ.. 10 లక్షల నిధులు కేటాయించడం జరిగిందని అన్నారు. మహిళలకు ఈ భవనం ఎంతో మేలు చేకూరుతుందని మహిళలు సంఘాల సమస్యలు భవనంలో సమావేశాలు నిర్వహించుకోవచ్చు అని అన్నారు. అడ్డగూడూరు కోటమర్తి మార్గమధ్యలో నూతనంగా నిర్మిస్తున్న సబ్ స్టేషన్ పనుల గురించి అడిగి తెలుసుకున్నారు.ఈ కార్యక్రమంలో ఎంపీడీవో శంకరయ్య, ఏపీఎం కళావతి,కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షుడు లింగాల నర్సిరెడ్డి, టిపిసీసీ రాష్ట్ర నాయకులు ఇటికాల చిరంజీవి,డిసిసి ఉపాధ్యక్షులు నిమ్మనగోటి జోజీ,కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు పాశం...