సైబర్ నేరాలపై అప్రమత్తతే అసలైన రక్షణ... జిల్లా ఎస్పీ టి. శ్రీనివాసరావు, ఐపీఎస్

⟹సైబర్ మోసాలకు గురైతే వెంటనే స్పందించండి... ఆలస్యం చేయవద్దు... అప్రమత్తంగా ఉండండి... ⟹ ప్రతి నెల మొదటి బుధవారం “సైబర్ జాగ్రత్త దివాస్” జోగులాంబ గద్వాల 4 నవంబర్ 2026 తెలంగాణ వార్తా ప్రతినిధి. గద్వాల.సాంకేతిక పరిజ్ఞానం అభివృద్ధి చెందుతున్న కొద్దీ సైబర్ నేరాల రూపాలు కూడా మారుతున్నాయని, ప్రజలు అప్రమత్తంగా ఉంటూ తమ వ్యక్తిగత, ఆర్థిక సమాచారాన్ని సురక్షితంగా ఉంచుకోవాలని జిల్లా ఎస్పీ శ్రీ టి. శ్రీనివాసరావు, ఐపీఎస్ సూచించారు. సైబర్ నేరాల నివారణలో భాగంగా ప్రతి నెల మొదటి బుధవారం నిర్వహిస్తున్న “సైబర్ జాగ్రత్త దివాస్” కార్యక్రమంలో భాగంగా బుదవారం జిల్లా ఎస్పీ కార్యాలయంలో సైబర్ నేరాలపై ప్రజలకు అవగాహన కల్పించే పోస్టర్లను...