గట్టు ఆస్పిరేషనల్ బ్లాక్ అభివృద్ధి ల్లో మెరుగైన పురోగతి సాధించాలి

వెనుకబడిన అంశాలపై ప్రత్యేక దృష్టి సారించి నిర్దేశిత లక్ష్యాలను చేరుకోవాలి విద్యా ప్రమాణాల పెంపు, ఐసీడీఎస్ సేవల మెరుగుదలకు సమన్వయంతో పనిచేయాలి కేంద్ర బృందం సభ్యుడు నోడల్ అధికారి లోకేష్ జోగులాంబ గద్వాల నాలుగు నవంబర్ 2026 తెలంగాణ వార్తా ప్రతినిధి. గద్వాల. జిల్లా పరిధిలోని గట్టు ఆస్పిరేషనల్ బ్లాక్‌లో అభివృద్ధి కార్యక్రమాలను మరింత వేగవంతం చేసి, నిర్దేశించిన లక్ష్యాలను సాధించేలా అన్ని శాఖల అధికారులు సమన్వయంతో పనిచేయాలని కేంద్ర బృందం సభ్యుడు,నోడల్ అధికారి లోకేష్ అన్నారు. బుధవారం ఐడీఓసీ సమావేశ మందిరంలో గట్టు ఆస్పిరేషనల్ బ్లాక్ అభివృద్ధి సూచికలపై నోడల్ అధికారి లోకేష్ పవర్‌పాయింట్ ప్రజెంటేషన్ ద్వారా సమీక్షించి, అదనపు కలెక్టర్ నర్సింగరావు తో...