ఆంధ్రప్రదేశ్ ఎన్నికల నేపథ్యంలో మద్యం దుకాణాలు మూసివేయాలి
జిల్లా కలెక్టర్ రిజ్వాన్ బాషా షేక్ జోగులాంబ గద్వాల 4 నవంబర్ 2026 తెలంగాణ వార్తా ప్రతినిధి. గద్వాల. తెలంగాణ రాష్ట్రంలోని సరిహద్దు సమీపంలో ఉన్న మద్య దుకాణాలను మూసివేయాలని గద్వాల జిల్లా కలెక్టర్ రిజ్వాన్ భాషా షేక్ బుధవారం ఒక్క ప్రకటనలు తెలిపారు. ఆంధ్రప్రదేశ్లో రెండో విడత ఎంపీటీసీ,జెడ్పీటీసీ ఎన్నికల నేపథ్యంలో శాంతిభద్రతల పరిరక్షణకు జిల్లాలోని 19 గ్రామాల్లో మద్యం దుకాణాలు,2బి బార్లు,కల్లు దుకాణాలు మూసివేయాలని జిల్లా కలెక్టర్ రిజ్వాన్ బాషా షేక్ సంబంధిత అధికారులకు ఆదేశించారు. తెలంగాణ ఎక్సైజ్ చట్టం 1968లోని సెక్షన్ 20(1) ప్రకారం ఈ ఉత్తర్వులు జారీ చేసినట్లు తెలిపారు.నవంబర్ 3వ తేదీ సాయంత్రం 5 గంటల నుంచి నవంబర్...