జిల్లాలో అన్ని ఆరోగ్య కార్యక్రమాల లక్ష్యాలను శతశాతం సాధించాలి – DM&HO డా. సంధ్యా కిరణ్మయి
జోగులాంబ గద్వాల 4 నవంబర్ 2026 తెలంగాణ వార్తా ప్రతినిధి. గద్వాల. జిల్లాలో అమలవుతున్న అన్ని ఆరోగ్య కార్యక్రమాల పురోగతిని సమీక్షించేందుకు అన్ని PHCల సూపర్వైజర్ సిబ్బందితో సమీక్ష సమావేశం నిర్వహించడం జరిగింది. ప్రతి ఆరోగ్య కార్యక్రమానికి సంబంధించి నిర్దేశించిన లక్ష్యాలు, పారామీటర్లను ఎప్పటికప్పుడు సమీక్షిస్తూ, నిర్దేశిత గడువులోగ శతశాతం లక్ష్యాలను సాధించాలని సిబ్బందిని ఆదేశించారు. క్షేత్రస్థాయిలో ఆరోగ్య కార్యక్రమాల అమలును నిరంతరం పర్యవేక్షిస్తూ, ప్రజలకు మెరుగైన వైద్య ఆరోగ్య సేవలు అందేల బాధ్యతాయుతంగ విధులు నిర్వహించాలని సూచించారు. విధుల పట్ల నిర్లక్ష్యం వహించకుండ, ప్రతి కార్యక్రమంలో ఆశించిన పురోగతి సాధించాలని, లక్ష్యాల సాధనలో నిర్లక్ష్యం లేద అలసత్వం ప్రదర్శిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు....