నాజిరుద్దీన్ బాబా దర్గా అభివృద్ధి శూన్యం.....పట్టించుకోని అధికారులు
ముఖ్యమైన పాయింట్స్:ఈనెల 6 7 తేదీల్లో ఉత్సవాలు ప్రారంభం అర్వపల్లి (జాజిరెడ్డిగూడెం):04 నవంబర్ 2026 తెలంగాణ వార్త రిపోర్టర్ సూర్యాపేట జిల్లాలో రెండో జాన్ పహాడ్ దర్గా గా ప్రసిద్ధి చెంది, మత సామరస్యానికి ప్రతీకగా నిలిచి హిందూ-ముస్లిం భక్తులను విశేషంగా ఆకర్షిస్తున్నది హజ్రత్ సయ్యద్ ఖాజా నసీరుద్దీన్ బాబా దర్గా. ఈ దర్గా అర్వపల్లి- జాజిరెడ్డిగూడెం గ్రామాల మధ్యలో పచ్చని పంట పొలాల మధ్య, సహజసిద్ధంగా ఏర్పడిన పెద్దగుట్ట పర్వత పాదాల చెంత కొలువై భక్తులను, పర్యాటకులను అమితంగా ఆకర్షిస్తుంది. కోరిన కోరికలు తీర్చే కొంగు బంగారం నసీరుద్దీన్ బాబాను మొక్కితే భక్తుల కోరికలు, కార్యాలు దిగ్విజయంగా నెరవేరుతాయని భక్తుల విశ్వాసం. ఇదంతా నాణేనికి...