పోలీస్ స్టేషన్‌లో సీజ్ బైక్‌లు మాయం..
గుట్టుచప్పుడు కాకుండా అమ్ముకున్న కానిస్టేబుల్ Suryapet:- ప్రజలకు రక్షణ కల్పించి, శాంతిభద్రతలను పరిరక్షించాల్సిన పోలీస్ స్టేషన్‌లోనే సీజ్ చేసిన వాహనాలు మాయమవ్వడం కలకలం రేపింది. వివిధ కేసుల్లో స్వాధీనం చేసుకున్న మోటార్ సైకిళ్లను అక్రమంగా విక్రయించిన వ్యవహారంలో ఓ కానిస్టేబుల్‌పై నల్గొండ జిల్లా ఎస్పీ సస్పెన్షన్ వేటు వేశారు. కేతపల్లి పోలీస్ స్టేషన్‌కు చెందిన, ప్రస్తుతం నకిరేకల్ ఠాణాలో పనిచేస్తున్న కానిస్టేబుల్ తొట్ల సైదులు (PC 1322)పై అవినీతి, అక్రమ కార్యకలాపాల ఆరోపణలు వచ్చాయి. దీని పై డీఎస్పీ, డీఎస్‌బీ అధికారులు క్షేత్రస్థాయిలో విచారణ జరిపి అక్టోబర్ 31న జిల్లా ఎస్పీకి నివేదిక సమర్పించారు. ఆ నివేదిక ఆధారంగా నల్గొండ జిల్లా పోలీస్ సూపరింటెండెంట్ కార్యాలయం...