ఉపాధ్యాయులు, అధ్యాపకుల సమస్యల పరిష్కారానికి ప్రభుత్వం కట్టుబడి ఉంది: మంత్రి సీతక్క

ఉపాధ్యాయులు, అధ్యాపకుల సమస్యల పరిష్కారానికి ప్రభుత్వం కట్టుబడి ఉంది: మంత్రి సీతక్క ఫీజు రీయింబర్స్‌మెంట్ బకాయిల సమస్యను ముఖ్యమంత్రి దృష్టికి తీసుకెళ్లి పరిష్కారానికి కృషి చేస్తాం.,, గ్రాడ్యుయేట్లకు, ప్రభుత్వానికి మధ్య వారధిగా సర్వోత్తం రెడ్డి పనిచేస్తారు.. ప్రైవేట్ పాఠశాలలు, కళాశాలల ఉపాధ్యాయులు, అధ్యాపకులు ఎదుర్కొంటున్న సమస్యలను ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లి పరిష్కరించేందుకు కృషి చేస్తామని రాష్ట్ర పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి, మహిళా శిశు సంక్షేమ శాఖ మంత్రి సీతక్క గారు అన్నారు. ఫీజు రీయింబర్స్‌మెంట్ బకాయిల విషయంలో విద్యాసంస్థలు ఎదుర్కొంటున్న ఇబ్బందులను ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లి, సంబంధిత అధికారులతో చర్చించి పరిష్కారానికి చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు. మంగళవారం హనుమకొండ హంటర్ రోడ్డులోని డీ కన్వెన్షన్ సెంటర్‌లో...