రోడ్డు వెడల్పునకు సంపూర్ణ మద్దతు.. ప్రజల హక్కుల హరణాన్ని సహించం!

- రోడ్డు విస్తరణ పేరుతో వ్యాపారులపై వేధింపులు ఆపాలి - చైర్మన్ భర్త, షాపుల ఆక్రమణలు తొలగించాలి - నష్టపరిహారం ఇచ్చాకే దుకాణాల తొలగింపు చేపట్టాలి - అఖిలపక్ష ఐక్యవేదిక అధ్యక్షుడు డాక్టర్ సతీష్ యాదవ్ వనపర్తి జిల్లా కేంద్రంలో రోడ్డు వెడల్పు పనులకు తాము పూర్తి మద్దతు ఇస్తామని, అయితే అభివృద్ధి పేరుతో ప్రజల హక్కులను కాలరాస్తూ విధ్వంసం సృష్టిస్తే సహించేది లేదని అఖిలపక్ష ఐక్యవేదిక స్పష్టం చేసింది. రోడ్డు విస్తరణ పనులను సోమవారం పరిశీలించిన ఐక్యవేదిక నాయకులు అక్కడి పరిస్థితులపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు.రోడ్డు వెడల్పు చేయాలనే నిర్ణయాన్ని అందరూ స్వాగతిస్తున్నారని, అందుకు వ్యాపారులు కూడా సహకరించేందుకు సిద్ధంగా ఉన్నారని తెలిపారు....