పెన్షన్ల పంపిణీలో పారదర్శకత పాటించాలి

పెన్షన్ల పంపిణీలో పారదర్శకత పాటించాలి – అర్హులైన ప్రతి లబ్ధిదారునికి ప్రభుత్వ సంక్షేమ ఫలాలు అందాలి గుర్రంగడ్డ గ్రామంలో పెన్షన్ల జిల్లా స్థాయి తనిఖీ నిర్వహించిన అదనపు కలెక్టర్ నర్సింగరావు జోగులాంబ గద్వాల 3 నవంబర్ 2026 తెలంగాణ వార్త ప్రతినిధి:- మండలంలోని గుర్రంగడ్డ గ్రామంలో మంగళవారం అదనపు కలెక్టర్ (స్థానిక సంస్థలు) నర్సింగరావు పెన్షన్ల పంపిణీకి సంబంధించి జిల్లా స్థాయి తనిఖీ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా అదనపు కలెక్టర్ మాట్లాడుతూ,ప్రభుత్వం పేదలు, వృద్ధులు, దివ్యాంగులు, వితంతువులు తదితర అర్హులైన వర్గాల సంక్షేమం కోసం అందిస్తున్న పెన్షన్లు వారికి ఆర్థిక భరోసాగా నిలుస్తున్నాయని తెలిపారు.పెన్షన్ల పంపిణీలో ఎలాంటి నిర్లక్ష్యానికి, అవకతవకలకు తావులేకుండా నిబంధనల ప్రకారం...