విద్యార్థులు చదువులో రాణించాలి

మెనూ ప్రకారం వంట చేయని ఏజెన్సీని తొలగించాలని ఆదేశాలు. వైద్య ఉపకేంద్రం సిబ్బందికి షోకాజు నోటీసుల జారీ. ఇంటర్ విద్యార్థులు ఉన్నత లక్ష్యాలతో ముందుకెళ్లాలి. జిల్లా కలెక్టర్ రిజ్వాన్ బాషా షేక్. జోగులాంబ గద్వాల 3 నవంబర్ 2026 తెలంగాణవార్త ప్రతినిధి:- ప్రభుత్వ పాఠశాలలలో పూర్తిస్థాయిలో మౌలిక వసతులు కల్పిస్తున్నామని, విద్యార్థులు చదువులో రాణించాలని జిల్లా కలెక్టర్ రిజ్వాన్ బాషా షేక్ అన్నారు. మానవపాడు మండలం జల్లాపురం గ్రామంలో మంగళవారం జిల్లా కలెక్టర్ పర్యటించారు. ముందుగా గ్రామంలోని జడ్పీహెచ్ఎస్ ను ఆకస్మికంగా సందర్శించి విద్యార్థులతో మాట్లాడారు. విద్యార్థులు క్రమం తప్పకుండా పాఠశాలకు హాజరుకావాలని సూచించారు. తల్లిదండ్రులతో తరచూ సమావేశాలు నిర్వహించి విద్యార్థులు పాఠశాలకు ఎక్కువగా సెలవులు...