భూ తగాదాల పరిష్కారానికి రీ సర్వే.

రీ సర్వే పనులు పారదర్శకంగా నిర్వహించాలి. రైతులు ఆరుతడి పంటలపై దృష్టి సారించాలి. ఉపాధి హామీ పనులను సద్వినియోగం చేసుకోవాలి. జిల్లా కలెక్టర్ రిజ్వాన్ బాషా షేక్. జోగులంబ గద్వాల 3 నవంబర్ 2026 తెలంగాణ వార్త ప్రతినిధి:- ప్రభుత్వ భూములను కాపాడడంతోపాటు భూ తగాదాలను పరిష్కరించేందుకే ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా రీ సర్వే పనులు చేయిస్తోందని జిల్లా కలెక్టర్ రిజ్వాన్ బాషా షేక్ అన్నారు. మానవపాడు మండలం జల్లాపురం గ్రామ శివారులో నిర్వహిస్తున్న రీసర్వే పనులను మంగళవారం జిల్లా కలెక్టర్ ఆకస్మికంగా పరిశీలించారు. నిబంధనలను అనుసరించి సర్వేను పారదర్శకంగా నిర్వహించాలని, హద్దుల విషయంలో ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా చూడాలన్నారు. రైతుల పొలాల సర్వే విషయంలో...