పోలీసుల అదుపులో లేడీ డాన్ కోనేటి సులోచన

ముఖ్యమైన పాయింట్స్:భూ కబ్జాలు, అమాయకులను మోసం చేయడం Madanapalli:- అన్నమయ్య జిల్లా కేంద్రమైన మదనపల్లెలో కలకలం సృష్టించిన లేడీ డాన్ కోనేటి సులోచనను పోలీసులు ఇవాళ ఉదయం అదుపులోకి తీసుకున్నారు. జిల్లాలోని మదనపల్లె పట్టణంలోని నీరుగట్టుపల్లికి చెందిన సులోచనపై మొత్తం 14 కేసులు ఉన్నట్లు సమాచారం. పలు పోలీస్ స్టేషన్లలో రౌడీ షీట్ ఉంది. భూ కబ్జాలకు పాల్పడటమే కాకుండా, అమాయకులను మోసం చేయడం.. భూముల వ్యవహారాల్లో అక్రమాలకు పాల్పడటం వంటి ఆరోపణలతో పాటు హత్యాయత్నానికి సంబంధించిన కేసులు కూడా ఆమెపై నమోదైనట్లు తెలుస్తోంది. మదనపల్లె వన్‌టౌన్‌, టూటౌన్‌, తాలూకా పోలీస్‌ స్టేషన్ల పరిధిలో ఆమెపై కేసులు నమోదయ్యాయి. ఆమె పలువురిని ఇబ్బంది పెడుతున్నట్లుగా పలు...