జోగులాంబ సన్నిధిలో... దసరా ఉత్సవాలు ఘనంగా నిర్వహించాలి

భక్తులకు అసౌకర్యం కలగకుండా ఏర్పాట్లు ఉండాలి జిల్లా కలెక్టర్ రిజ్వాన్ బాషా షేక్ గద్వాల, (అక్టోబర్ 06) : దసరా శరన్నవరాత్రి మహోత్సవాలను జోగులాంబ సన్నిధిలో ఘనంగా నిర్వహించాలని జిల్లా కలెక్టర్ రిజ్వాన్ బాషా షేక్ అధికారులను ఆదేశించారు.మంగళవారం ఐడీఓసీ వీడియో కాన్ఫరెన్స్ హాలులో దసరా శరన్నవరాత్రి ఉత్సవాల ఏర్పాట్లపై జిల్లా కలెక్టర్ సంబంధిత అధికారులతో సమన్వయ సమావేశం నిర్వహించారు.ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ,ఈ నెల 11 నుంచి 20వ తేదీ వరకు నిర్వహించే దసరా శరన్నవరాత్రి ఉత్సవాలకు అన్ని శాఖల అధికారులు సమన్వయంతో ఏర్పాట్లు పూర్తి చేసి,భక్తులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా ఘనంగా నిర్వహించాలన్నారు.భక్తులకు దర్శనం,ప్రసాదం, త్రాగునీరు, మరుగుదొడ్లు తదితర ప్రాంతాలకు సులభంగా చేరుకునేలా...