ఆర్టిసి ఎన్నికలలో టిఎం యు, ఇయు, ఎన్ ఎం యు జె ఎసిని అత్యదిక మెజారిటీతో గెలిపించాలి

ముఖ్యమైన పాయింట్స్:టిఎంయు రాష్ట్ర జనరల్ సెక్రటరీ థామస్ రెడ్డి తెలంగాణ రాష్ట్రంలో జరుగుతున్న ఆర్టీసీ గుర్తింపు ఎన్నికల్లో టిఎం యు, ఇయు, ఎన్ ఎమ్ యు యూనియన్ జె ఎసి ని అత్యధిక మెజార్టీతో గెలిపించాలని జేఏసీ నాయకులు, టిఎంయు జనరల్ సెక్రెటరీ ధామస్ రెడ్డి అన్నారు. శనివారం సాయంత్రం సూర్యాపేట డిపోలో జరిగిన జేఏసీ ఎన్నికల ప్రచార సమావేశంలో ఆయన మాట్లాడుతూ తెలంగాణలో అసలైన యూనియన్ తమ జేఏసీ మాత్రమే అని , కార్మికుల సమస్యల పరిష్కారం కోసం జె ఎసి ని గెలిపించాలని అన్నారు‌. తమ జేఏసీ తెలంగాణలో 10,000 ఓట్ల మెజార్టీతో ఘన విజయం సాధిస్తుందని తెలిపారు. ఎటువంటి ప్రలోభాలకు లొంగకుండా...