గాంధీ–శాస్త్రి ఆశయాలు నేటి తరానికి స్ఫూర్తిదాయకం

ముఖ్యమైన పాయింట్స్:సీనియర్ అసిస్టెంట్ మనోహర్ సత్యం, అహింస మార్గంలో గాంధీజీ.. జై జవాన్–జై కిసాన్‌తో శాస్త్రి మహనీయుల ఆశయాలను ఆచరణలో పెట్టాలి: సీనియర్ అసిస్టెంట్ మనోహర్ జోగులాంబ గద్వాల 2 అక్టోబర్ 2026 తెలంగాణ వార్త ప్రతినిధి:-. జాతిపిత మహాత్మా గాంధీ 157వ జయంతి, ఇటిక్యాల తహసిల్దార్ కార్యాలయంలో ఘనంగా నివాళులర్పించారు. సీనియర్ అసిస్టెంట్ మనోహర్, గాంధీజీ, చిత్రపటానికి, పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా సీనియర్ అసిస్టెంట్ మనోహర్, మాట్లాడుతూ.. సత్యం, అహింసను నమ్మి వాటినే ఆయుధాలుగా చేసుకుని భారత స్వాతంత్ర్య ఉద్యమాన్ని ముందుకు నడిపించిన మహనీయుడు మహాత్మా గాంధీ అని అన్నారు. ప్రజలందరినీ ఏకతాటిపైకి తీసుకువచ్చి స్వాతంత్ర్య సాధనలో కీలక పాత్ర పోషించారని...