గాంధీ జయంతి నాడు మాంసం విక్రయాలు బంద్ - ఉల్లంఘిస్తే లైసెన్స్ రద్దు
ముఖ్యమైన పాయింట్స్:మున్సిపల్ కమిషనర్ హనుమంత్ రెడ్డి హెచ్చరిక సూర్యాపేట, అక్టోబర్ 01 :- మహాత్మా గాంధీ జయంతి సందర్భంగా అక్టోబర్ 2న సూర్యాపేట మున్సిపాలిటీ పరిధిలో మాంసం, చికెన్ విక్రయాలను పూర్తిగా నిలిపివేయాలని మున్సిపల్ కమిషనర్ సీహెచ్ హనుమంత్ రెడ్డి ఆదేశించారు. గాంధీజీ అహింసా సిద్ధాంతానికి గౌరవసూచకంగా ఆ రోజు పట్టణంలోని అన్ని మాంసం దుకాణాలు మూసివేయాలని, జంతువధ, జీవహింసకు పాల్పడటం నిబంధనలకు విరుద్ధమని తెలిపారు. ఆదేశాలను బేఖాతరు చేసి దుకాణాలు తెరిచి విక్రయిస్తే ట్రేడ్ లైసెన్స్ రద్దుతో పాటు జరిమానా, చట్టపరమైన చర్యలు తప్పవని హెచ్చరించారు. గాంధీ జయంతి రోజున అహింస, పరిశుభ్రత, సామాజిక బాధ్యత పాటించాలని, వ్యాపారులు, ప్రజలు సహకరించాలని కోరారు.