ఘనంగా రాంరెడ్డి దామోదర్ రెడ్డి విగ్రహావిష్కరణ
ముఖ్యమైన పాయింట్స్:ప్రజాసేవకు అంకితమైన మహానేతకు ఘన నివాళి జాజిరెడ్డిగూడెం:- జాజిరెడ్డిగూడెం మండల కేంద్రంలో దివంగత నాయకులు, మాజీ మంత్రివర్యులు రాంరెడ్డి దామోదర్ రెడ్డి ప్రథమ వర్ధంతి సందర్భంగా సీనియర్ కాంగ్రెస్ నాయకులు దరూరి యోగనందా చార్యులు గారి ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన విగ్రహావిష్కరణ కార్యక్రమం ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా హాజరైన భువనగిరి పార్లమెంట్ సభ్యులు చామల కిరణ్ కుమార్ రెడ్డి, దామన్న సోదరులు తెలంగాణ రైతు సంక్షేమ కమిషన్ సభ్యులు, సీనియర్ కాంగ్రెస్ నాయకులు రాంరెడ్డి గోపాల్ రెడ్డి, రాంరెడ్డి క్రిష్ణారెడ్డి, ఏఐసీసీ సభ్యులు రాంరెడ్డి సర్వోత్తమ్ రెడ్డి, రాష్ట్ర కాంగ్రెస్ సీనియర్ నాయకులు పోతు భాస్కర్, తెలంగాణ రైతు సంక్షేమ...