గణేష్ నిమజ్జనం సందర్భంగా నేడు జిల్లాలోని నాలుగు మున్సిపాలిటీలలో మద్యం దుకాణాలు బంద్
అలంపూర్, అయిజ, గద్వాల, వడ్డేపల్లి మున్సిపాలిటీలలో, ఎర్రవల్లి లో వైన్‌షాపులు, బార్లు, కల్లు దుకాణాల మూసివేతకు కలెక్టర్ ఆదేశాలు ప్రశాంత వాతావరణంలో నిమజ్జనం జరిగేలా చర్యలు జోగుళాంబ గద్వాల 25 సెప్టెంబర్ తెలంగాణ వార్త ప్రతినిధి:- గద్వాల. జిల్లాలో గణేష్ నవరాత్రుల ముగింపు సందర్భంగా తేది.25.09.2026 శుక్రవారం నిర్వహించనున్న గణేష్ విగ్రహాల నిమజ్జనాలను ప్రశాంతంగా, ఎలాంటి అవాంఛనీయ ఘటనలకు తావులేకుండా నిర్వహించేందుకు జిల్లా యంత్రాంగం కీలక నిర్ణయం తీసుకుంది. జిల్లా కలెక్టర్ రిజ్వాన్ భాషా షేక్, ఆదేశాల మేరకు శుక్రవారం తేది 25.09.2026 ఉదయం 06 గంటల నుండి తేది. 26.09.2026 ఉదయం 06 గంటల వరకు గద్వాల, అయిజ, వడ్డేపల్లి, అలంపూర్ ఈ నాలుగు...