🏠 www.telanganavaartha.in
Watermark
Newspaper Logo
Date of Publish : 18 November 2026, 2:21 am Posted by : A.Timma Gurudu

ఇందిరమ్మ జీవిత బీమా పథకంపై సర్పంచులకు డీలర్లకు అవగాహన కార్యక్రమం.

News Image
ఇందిరమ్మ జీవిత బీమా పథకం పథకంపై సర్పంచులకు డీలర్లకు అవగాహన కార్యక్రమం.
రేషన్ షాపుల వారీగా లబ్ధిదారుల గుర్తింపు.
సంబంధిత అధికారులు సమన్వయంతో పనిచేయాలి.
డి డబ్ల్యు ఓ మండల ప్రత్యేక అధికారి సునంద.
జోగులాంబ గద్వాల 17 నవంబర్ 2026 తెలంగాణవార్త ప్రతినిధి:- మండల ప్రజా పరిషత్ కార్యాలయం నందు ఎంపీడీవో అధ్యక్షతన మండలంలోని వివిధ గ్రామాల సర్పంచులకు డీలర్లకు ఇందిరమ్మ జీవిత బీమా పథకంపై అవగాహన కార్యక్రమం నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమానికి డిస్టిక్ వెల్ఫేర్ ఆఫీసర్ &మండల ప్రత్యేక అధికారి సునంద హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రతి కుటుంబానికి ప్రతిష్టాత్మకంగా ఇందిరమ్మ కుటుంబ జీవిత బీమా పథకం అమలులో భాగంగా మండలంలోని అన్ని గ్రామ పంచాయతీల, పరిధిలో ప్రత్యేక శిబిరాల నిర్వహణకు అవసరమైన ఏర్పాట్లను పకడ్బందీగా పూర్తి చేయాలని అధికారులను ఆదేశించారు. ఈ నెల 19 వ తేదీ నుంచి ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా ఇందిరమ్మ కుటుంబ జీవిత బీమా పథకాన్ని ప్రవేశపెడుతున్నందున మండలంలోని వివిధ గ్రామాలలో ప్రత్యేక శిబిరాలు ప్రారంభం కానున్నందున అధికారులు ముందస్తు కార్యాచరణతో సిద్ధంగా ఉండాలన్నారు. రేషన్ కార్డుదారుల డేటాను ప్రతి మండలానికి పంపించడం జరుగుతుందని దీని ఆధారంగా ఆయా రేషన్ దుకాణాల పరిధిలోని లబ్ధిదారులందరి చేత బీమా పథకానికి దరఖాస్తు చేయించేలా ప్రణాళికతో అధికారులు ముందుకెళ్లాలన్నారు. పథకం పకడ్బందీ అమలుకు ఈనెల 18 న స్థానిక సంస్థల ప్రజాప్రతినిధులు, అధికారులు, రేషన్ డీలర్లు, మండలంలోని అధికారులు సమన్వయంతో పనిచేయాలని సూచనలు చేయాలన్నారు.
ఇటిక్యాల మండలంలో (14) గ్రామ పంచాయతీలు ఉండగా కేవలం ఇద్దరు సర్పంచులు మాత్రమే సమావేశానికి హాజరయ్యారు. మరియు డీలర్లు కూడా కొంతమంది మాత్రమే సమావేశంలో పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో తహసిల్దార్ శ్రీకాంత్ రెడ్డి. ఎంపీడీవో రమాదేవి షాబాద్ సర్పంచ్ డేవిడ్ వావిలాల సర్పంచ్ చిన్న మోహన్ గౌడ్ తదితర డీలర్లు పాల్గొన్నారు.
🏠 Home